Posts

Showing posts from October, 2024

Luxury

కామం ___ ఆడపిల్ల అంటే ఆప్యాయతతో చూసే కళ్ళు కన్నా కామంతో ఆశగా చూసే కళ్ళే ఎక్కువ నా దేహంలోని ప్రతి భాగాన్ని చూస్తే నీకు ఎందుకు ఆశ పుట్టిద్దో గాని నీ కామంతో చూసే కళ్ళను చూసిన ప్రతిసారి రోత మరియు నా కనుబొమ్మలు దగ్గరికి వచ్చి నా కళ్ళు బగ బగ మండుతూ ఎర్రగా మారేంత అసహ్యం కలుగుతుంది. నా రొమ్ము వత్తి పట్టి నువ్వు పొందే ఆనందం ఏంటో గాని ఆ సమయంలో, అదే రొమ్ము నుంచి నీకు పాలు వత్తి పట్టిన అమ్మతనం గుర్తురాలేదా____ నా పెదవులను నెత్తురు కారెలా కొరికే నీ పైశాచికత్వం ఏంటో గాని ఆ సమయంలో, అదే పెదవులతో నీ నుదిటి మీద మెత్తగా ముద్దాడిన అమ్మతనం గుర్తురాలేదా.. నా చేతులని నొక్కిపట్టి నలిపి నలిపి నువ్వు పొందే ఆనందం ఏంటో గాని ఆ సమయంలో, అదే చేతులతో నిన్ను కౌగిలించుకొని ప్రేమతో గోరుముద్దలు పెట్టిన అమ్మతనం గుర్తురాలేదా.....  నా యోనిలో నెత్తురు గట్టకట్టెల చేసే నీ మగతనం ఏంటో గాని ఆ సమయంలో, అదే యోని కారణంగా నీ పిండాన్ని తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన అమ్మతనం గుర్తురాలేదా... నీ ప్రాణాలని కాపాడుకోవడానికి నా శిరస్సు పై, నా దేహంలోని ప్రతి భాగం పై పదే పదే నెత్తురు కారెలా కొడుతూ  నువ్వు పొందే క్రూరమైన ఆనందం, ...